దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి
పాలకుర్తి, మేజర్ న్యూస్, దాతల సహకారంతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ కు ఉపయోగించు కోవా లని బిజెపి మండల నాయకులు చిక్కుడు అశోక్, మొగిలి, వంశీ ప్రభుత్వాన్ని కోరారు. మండలం లోని గూడూరు గ్రామంలో నిరుప యోగంగా ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ భవనాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు మారవ్ రవికుమార్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద విద్యార్థుల వసతి కోసం దాతలు, ప్రభుత్వ నిధులతో రూ.21 లక్షల వ్యయంతో నిర్మించిన హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉందని,ప్రస్తుతం ఎస్సీ బాలుర హాస్టల్ అద్దె భవనంలో ఉందని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు ప్రభుత్వ భవనాన్ని మరమ్మతు లు చేపట్టి వినియోగం లోకి తీసుకురావాలని ప్రభుత్వ ఆస్తుల పరి రక్షణకు చర్యలు తీసు కోవాలని బీజేపీ నాయ కులు డిమాండ్ చేశా రు. కార్యక్రమం లో జిల్లా నాయకులు దొంగరిమహేందర్,కడుదుల నిరంజన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి పెనుగొండ సోమేశ్వర్, సీనియర్ నాయకులు కాసోజు సమ్మయ్య చారీ తది తరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ,సోమయ్య ,పాలకుర్తి ,జనగామ జిల్లా