BREAKING
స్టేజ్ పైనుంచి పంపించివేయడంపై తీవ్రంగా కలత చెందిన శిల్పా రావు.. స్పందించిన మ్యూజిక్ ప్రాజెక్ట్ నిర్వాహకులు! అభివృద్ధి కోసం.. కూటమికి పురపాలన అందించండి.. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రీ పరేడ్ కు పియూ విద్యార్థి రాణా ప్రతాప్ ఎంపిక బాలవికాస ఆధ్వర్యంలో 40 మంది వృద్ధులకు నిత్యవసర సరుకులు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక బిగ్‌బాస్ 20 వేదికపై గ్యాంగ్‌స్టర్ కల్చర్‌పై రోహిత్ శెట్టి ఆగ్రహం.. టైగర్ ష్రాఫ్ మరియు తనపై జరిగిన కాల్పుల ఘటనలపై వ్యాఖ్యలు! మానకొండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘూస్‌ఖోర్ పండిత్' వివాదం ప్రభావం 'గజబ్ రాత్'పై పడదు.. మనోజ్ బాజ్‌పేయీ, నీరజ్ పాండే ధీమా! తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు హింసాత్మక సినిమాలు చూస్తూ పాప్‌కార్న్ ఎలా తింటారు? రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తున్న ‘ఉడ్తా తీర్’.. శనివారం రోజు ఏకంగా 75 శాతం పెరిగిన కలెక్షన్లు! 20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షాహినా జోరుగా ఎన్నికల ప్రచారం మంచిర్యాల ముదిరాజ్ భవనానికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తా అవకాశం ఇవ్వండి...మార్పు చూపిస్తా -కార్పొరేటర్ అభ్యర్థి రాజారెడ్డి అభ్యర్థన కోస్తాంధ్రకు హైఅలర్ట్.. కాకినాడ - నర్సాపురం మధ్య తీరం దాటనున్న తుఫాన్!

రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం

Select Suryaa Now
రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం

 

రేణిగుంట మేజర్ న్యూస్: తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని పూడి–రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే ట్రాక్‌ పక్కన కిలోమీటర్‌ నంబర్‌ 132/4-6 వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటుందని, రైలు నుంచి జారిపడి లేదా ప్రమాదానికి గురై మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడి తల, కుడిచేయి, ఎడమ మణికట్టు, కుడి చీలమండ వద్ద తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మృతుడు నీలం రంగు ఫుల్‌హ్యాండ్‌ షర్టు, నీలం రంగు లోదుస్తులు, ఆరెంజ్‌ రంగు పంచె ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసినవారు లేదా కుటుంబ సభ్యులు రైల్వే జీఆర్పీ పోలీసులును సంప్రదించాలని అధికారులు కోరారు.