అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి
దేవరుప్పుల , మేజర్ న్యూస్, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయడమే లక్ష్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం దేవరుప్పుల బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో యువజన విభాగం మండల అధ్యక్షుడు బానోతు నవీన్ నాయక్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఉచిత నమోదు కేంద్రం ద్వారా వందలాది మంది పట్టభద్రులు నమోదు చేసుకున్నారని, మిగిలిన అర్హులను గుర్తించి గ్రామగ్రామాన నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఒక్క అర్హుడూ ఓటరు నమోదుకు దూరం కాకూడదని నాయకులు పేర్కొన్నారు. నమోదు కాని అర్హులైన పట్టభద్రులు డిగ్రీ మెమో జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో దేవరుప్పుల బీఆర్ఎస్ కార్యాలయంలో సంప్రదించాలని యువజన విభాగం మండల అధ్యక్షుడు బానోతు నవీన్ కుమార్ కోరారు. సమావేశంలో యువజన నాయకులు పందెనబోయిన మధు గుండె రమేష్ దాసగాని భరత్ కారుపోతుల సందీప్ దౌపాటి అనిల్ వడ్లకొండ శ్రీకాంత్ పాండు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: ఎల్లేష్, దేవరుప్పుల, జనగామ జిల్లా