BREAKING
టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిష్ కొలంబియాలో గెలుపొందిన కన్జర్వేటివ్ పార్టీ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శిని అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన నాయకులు ఉత్తరప్రదేశ్ నా జన్మస్థలం.. ఎన్ని నగరాల్లో తిరిగినా నేను ఆ రాష్ట్రం బిడ్డనే అంటున్న 'మీర్జాపూర్' నటి శ్వేతా త్రిపాఠి! సెనెగల్ రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాల కోత భయం మంచి పనులకోసం మహబూబ్ బాషా ఎన్నిక కావాలి నాని 'ది ప్యారడైజ్' సినిమాపై ఘాటు రివ్యూ ఇచ్చిన మహేష్ బాబు కుమారుడు గౌతమ్.. 'చాలా నిరాశపరిచింది' అంటూ పోస్ట్! ఇండిపెండెంట్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బోయ నాగేశ్వరికి పెరుగుతున్న ప్రజా మద్దతు బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత పరిణీతి చోప్రా 'షక్' చిత్రంలో తన సీన్లు తొలగించడంపై అనూప్ సోని తీవ్ర నిరాశ.. స్పందించిన నటుడు! కందుకూరులో ఘనంగా రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమం 109వ డివిజన్‌లో వైసీపీ నుంచి జనసేనలోకి 200 మంది కార్యకర్తల చేరిక

​ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన పిచ్చి మొక్కలు

Select Suryaa Now
​ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన పిచ్చి మొక్కలు
సూర్య .నేరడిగొండ : మండలంలోని కుప్టి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు, తీగలు విపరీతంగా పెరిగి దానిని పూర్తిగా కమ్మేశాయి. దీంతో విద్యుత్ పరికరాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడమే కాకుండా, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉన్నప్పటికీ, మొక్కలు ఏపుగా పెరిగి విద్యుత్ పరికరాలను కప్పేశాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి షార్ట్‌ సర్క్యూట్‌ వంటి పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని, అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరుతున్నారు.సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి.. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, తీగలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని విద్యుత్ అధికారులను కుమారి గ్రామస్తులు కోరుతున్నారు