ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: ప్రతి గ్రామ అభివృద్ధి లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మార్కెట్ అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని 14 గ్రామాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామానికి 20 నుంచి 30 నిమిషాల సమయం కేటాయించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలు చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశం నాగరాజు గౌడ్, అమరచింత మునిసిపల్ చైర్ పర్సన్ సువర్ణ రవికుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం ఆత్మకూరు వనపర్తి జిల్లా.