BREAKING
స్టేజ్ పైనుంచి పంపించివేయడంపై తీవ్రంగా కలత చెందిన శిల్పా రావు.. స్పందించిన మ్యూజిక్ ప్రాజెక్ట్ నిర్వాహకులు! అభివృద్ధి కోసం.. కూటమికి పురపాలన అందించండి.. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రీ పరేడ్ కు పియూ విద్యార్థి రాణా ప్రతాప్ ఎంపిక బాలవికాస ఆధ్వర్యంలో 40 మంది వృద్ధులకు నిత్యవసర సరుకులు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక బిగ్‌బాస్ 20 వేదికపై గ్యాంగ్‌స్టర్ కల్చర్‌పై రోహిత్ శెట్టి ఆగ్రహం.. టైగర్ ష్రాఫ్ మరియు తనపై జరిగిన కాల్పుల ఘటనలపై వ్యాఖ్యలు! మానకొండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘూస్‌ఖోర్ పండిత్' వివాదం ప్రభావం 'గజబ్ రాత్'పై పడదు.. మనోజ్ బాజ్‌పేయీ, నీరజ్ పాండే ధీమా! తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు హింసాత్మక సినిమాలు చూస్తూ పాప్‌కార్న్ ఎలా తింటారు? రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తున్న ‘ఉడ్తా తీర్’.. శనివారం రోజు ఏకంగా 75 శాతం పెరిగిన కలెక్షన్లు! 20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షాహినా జోరుగా ఎన్నికల ప్రచారం మంచిర్యాల ముదిరాజ్ భవనానికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తా అవకాశం ఇవ్వండి...మార్పు చూపిస్తా -కార్పొరేటర్ అభ్యర్థి రాజారెడ్డి అభ్యర్థన కోస్తాంధ్రకు హైఅలర్ట్.. కాకినాడ - నర్సాపురం మధ్య తీరం దాటనున్న తుఫాన్!

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేల హామీ

Select Suryaa Now
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు  ఎమ్మెల్యేల హామీ

 ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయమైన డిమాండ్లను ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు తీసుకెళ్లారు. ఎన్ హెచ్ ఎం  ఉద్యోగుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యేలు, వారి డిమాండ్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం మంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించనున్నట్లు తెలిపారు. సోమవారం ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు తమను కలవాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని నాయకులు కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగులు 13 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు . కార్యక్రమంలో  ఎన్హెచ్ఎం జేఏసీ  జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, JAC ప్రతినిధులు రేణయ్య, అనంతచారి, డా. సాయి కాంత్, డా. జగన్, శ్రీనివాసులు, హైమవతి తదితరులు పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్  నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్