ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
సూర్య జగిత్యాల ప్రతినిధి:ధర్మపురి బస్‌స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రూ. 2.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆధునీకరణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రాజెక్టులో భాగంగా రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, సీసీ పేవ్‌మెంట్, గ్రానైట్ ఫ్లోరింగ్, భవనానికి ఏసీపీ క్లాడింగ్, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు, రూఫ్ స్లాబ్, సీలింగ్ మరమ్మతులు చేపట్టనున్నారు. అదేవిధంగా వర్షపు నీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి, పెయింటింగ్, పల్లపు ప్రాంతాల్లో కంకర వేయడం, ల్యాండ్‌స్కేపింగ్, విద్యుదీకరణ, పంప్‌సెట్‌తో కూడిన బోర్‌వెల్ ఏర్పాటు చేయనున్నారు.