BREAKING
నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల! గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి స్థానికులకు అందుబాటులో ఉంటాం... -64, 66 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : కార్పొరేటర్ అభ్యర్థులు అన్నా మల్లీశ్వరి, అన్నా లోకేష్ జెడ్పీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్ల స్వీకరణ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేల హామీ రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం ముంబై బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో సింగర్ శిల్పా రావుకు చేదు అనుభవం.. మధ్యలోనే షో ఆపేయడంతో అభిమానుల ఆగ్రహం! చెన్నై థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘జైలర్ 2’ చూసిన రజనీకాంత్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ!

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం

Select Suryaa Now
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం

సూర్య జగిత్యాల ప్రతినిధి:పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఆదివారం జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లతో కలిసి  శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసన్నాంబ, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు,నారాయణ రెడ్డి , సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.