BREAKING
MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల! గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి స్థానికులకు అందుబాటులో ఉంటాం... -64, 66 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : కార్పొరేటర్ అభ్యర్థులు అన్నా మల్లీశ్వరి, అన్నా లోకేష్ జెడ్పీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్ల స్వీకరణ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేల హామీ రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం ముంబై బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో సింగర్ శిల్పా రావుకు చేదు అనుభవం.. మధ్యలోనే షో ఆపేయడంతో అభిమానుల ఆగ్రహం! చెన్నై థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘జైలర్ 2’ చూసిన రజనీకాంత్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ! పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు జోడేఘాట్‌కు బయలుదేరిన కుంరం భీo కుటుంబ సభ్యులు ఎఫ్‌సీఐ డిపోలో స్వచ్ఛతా అభియాన్‌ బీజేపీ కార్యకర్తలతో పాటు మన్ కి బాత్ వీక్షించిన ఎంపీ అరుణ 14వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ ప్రజలతో ముఖాముఖి

అభివృద్ధి, సేవా దృక్పథం ఉన్న వారికే ఓటర్ల మద్దతు- మంత్రి ఎన్ఎండి ఫరూక్

Select Suryaa Now
అభివృద్ధి, సేవా దృక్పథం ఉన్న వారికే ఓటర్ల మద్దతు- మంత్రి ఎన్ఎండి ఫరూక్

సూర్య, నంద్యాల బ్యూరో:
అభివృద్ధి, సేవా దృక్పథం ఉన్న వారికే ఓటర్ల మద్దతు ఉంటుందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు బాలాజీ కాంప్లెక్స్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఖండే శ్యామ్ సుందర్ లాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబన్, యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నంద్యాల పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు . గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామని తెలిపారు . ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసే అభ్యర్థులనే ప్రజలు ఆదరించాలని, 13వ వార్డు టీడీపీ అభ్యర్థి ఖండే శ్యామ్ సుందర్ లాల్‌తో పాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబన్, ఇతర కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు. 13వ వార్డు టీడీపీ అభ్యర్థి ఖండే శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ గతంలో నిధులు ఇవ్వకపోయినా కౌన్సిల్‌లో పోరాడి సుమారు రూ. 1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను వార్డులో చేపట్టామని తెలిపారు. మంత్రి ఫరూక్ సహకారంతో మరో రూ. కోటి అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని తెలిపారు . గత 15 ఏళ్లుగా ఉచిత వైద్య శిబిరాలు, కంటి అద్దాల పంపిణీ, దివ్యాంగులకు అవయవాల అమరిక, పేదల వివాహాలకు సాయం వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నామని గుర్తుచేశారు. 15వ వార్డు కూటమి అభ్యర్థి వేణు, తాను ప్రజాసేవలోనే ఉంటామని, కరోనా కష్టకాలంలో నిత్యావసర సరుకులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు భోజనాలు అందించిన ఘనత తమదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అడ్డదారులు తొక్కుతూ, స్థానికేతరులను బరిలోకి దించుతూ ప్రత్యర్థులు ఆడుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. వ్యాపారాలు, స్వార్థ రాజకీయాల కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వారినే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్యులంతా అభివృద్ధికి, నిబద్ధతకు అండగా ఉంటూ తమకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. నంద్యాలలోని 52 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి ఎన్ఎండి ఫరూక్ గార్లకు కానుకగా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బింగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్త, ఆనంద్ గురూజీ, మహానందీశ్వర స్వామి దేవస్థానం చైర్మెన్ బోయ రామకృష్ణ, కాలికాంబ దేవస్థానం చైర్మెన్ బింగుమళ్ళ సుబ్బలక్ష్మయ్య, 15వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి పబ్బతి వేణుగోపాల్, జిల్లెల్ల శ్రీరాములు , డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ అధ్యక్షుడు దుద్దెల సురేష్, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, సెగు శ్రీనివాసులు, ఉప్పరి సురేష్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఆర్యవైశ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు

*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*