బీజేపీ కార్యకర్తలతో పాటు మన్ కి బాత్ వీక్షించిన ఎంపీ అరుణ
మహబూబ్ నగర్ సూర్య న్యూస్ -
కొండంగల్ నియోజకవర్గంలో దౌల్తాబాద్ మండలం గోకఫసాల్ బాద్ గ్రామంలో ప్రధాన మంత్రి 139వ మాన్ కీ బాత్ కార్యక్రమం స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలసి వీక్షించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.
కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్, ప్రతాప్ రెడ్డి, పూనం చంద్ లహుటి, కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు అశోక్, సతీష్, బస్వరాజు, కేశవ రెడ్డి, శంకర్, బుగ్గప్ప,మురళీధర్,రాజశేఖర్, మహబూబ్ అలీ, కేశవ్ రెడ్డి, రాఘవేంద్ర, భాస్కర్, వివిధ మండలాల ముఖ్య నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుఎంపీ డీకే అరుణకొడంగల్ నియోజకవర్గంలోని గోకా ఫసల్ వాడ లో మన్ కీ బాత్ లో పాల్గొనడం జరిగింది.త్వరలో గ్రామ గ్రామాన పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తులు, వస్త్రాల,వస్తువుల విశేషాల గురించి దేశం మొత్తానికి మన్ కీ బాత్ లో తెలియజేస్తున్నారు.
భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూసేలా పరిపాలన నరేంద్ర మోడీ చేస్తున్నారు.దీనిని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతుంది.ప్రధాన మంత్రి గా నరేంద్ర మోదీ గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలో నిలబెట్టారు.అత్యంత కష్టకాలం అయిన కోవిడ్ లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కున్నాం.ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన నాయకుడు నరేంద్ర మోదీ అని అన్నారు.ప్రపంచ దేశాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి.యుద్ధాలు, ఆర్థిక ఇబ్బందులు, అంతర్గత అంశాలతో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి.విదేశీ వేదికల పై భారతదేశాన్ని కించపరిచేవిధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు.ఆపరేషన్ సింధూర్ తో శత్రుదేశాలకు భయం పుట్టించారు.వికాసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారు.దేశ విచ్చిన్నం కోరుకునే వారితో కలసి రాహుల్ గాంధీ నడుస్తున్నారు. సర్ ప్రక్రియ మో దటి సారి జరుగుతుంది కాదు.. ఇప్పటికి 8 సార్లు జరిగింది.తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ చేసి వచ్చిందా.? రాహుల్ గాంధీ చెప్పాలి.కాంగ్రెస్ చేసే అబద్ధపు ప్రచారం ప్రజలు గమనించాలి.ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా.. దిల్లీలో రేవంత్ రెడ్డి ధర్నాలు చేస్తున్నారు.కొండంగల్ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇండ్లు కుల్చుతున్నారు.ప్రజలకు నష్టపరిహారం ఇవ్వకుండా.. కూల్చివేతలు చేయడం అన్యాయం.రోడ్ల నిర్మాణానికి టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.రోడ్లు మాత్రమే కాదు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి.ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలి.అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలి.. కానీ కేవలం కాంగ్రెస్ వాళ్ళకే చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి నిష్పక్షపాతంగా నిధులు ఇస్తుంది.తెలంగాణ భవిష్యత్ బాగుండాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలి.పట్టభద్రుల ఎన్నికలలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి.
ఓం ప్రకాష్ - మహబూబ్ నగర్