BREAKING
కూటమి అభ్యర్థి వెంకట సాయి ని ఆశీర్వదించండి.. 21వ డివిజన్లో భవాని రవికుమార్, దేవానంద్ విస్తృత ప్రచారం కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు? నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ! మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....! సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ​ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన పిచ్చి మొక్కలు కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. టి సి వరుణ్.. పాతూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల! గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు

జోడేఘాట్‌కు బయలుదేరిన కుంరం భీo కుటుంబ సభ్యులు

Select Suryaa Now
జోడేఘాట్‌కు బయలుదేరిన కుంరం భీo కుటుంబ సభ్యులు
సూర్య జైనూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ (యు) మండలం పెద్ద దొబ గ్రామంలో ఆదివాసీ పోరాట యోధుడు, జల్–జంగల్–జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన అమరజీవి కొమరం భీం 86వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, కొమరం భీం వారసులు జోడేఘాట్‌కు బయలుదేరారు.అక్టోబర్ 26న జోడేఘాట్‌లో నిర్వహించనున్న కుంరం భీం 86వ వర్ధంతి రాష్ట్ర పండుగలో పాల్గొని, అమరవీరుడు కుంరం భీంకు ఘనంగా నివాళులర్పించేందుకు కుటుంబ సభ్యులు, వారసులు తరలివెళ్తున్నారు.ఈ సందర్భంగా కుంరం భీం వారసులు కుంరం సోనేరావు కుంరం భీంరావ్ ఆదివాసీల హక్కులు, భూమి, అడవి, నీటి కోసం పోరాడిన మహనీయుడు కుంరం భీం త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు.అక్టోబర్ 26న జరిగే వర్ధంతి కార్యక్రమానికి ఆదివాసీ సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆత్రం మీరు బాయి ఆత్రం జలింసావ్ గ్రామ పెద్దలు సోము రాంశావ్ నాగోరావ్ ఆత్రం ఆనంద్ రావు గ్రామ , ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.