BREAKING
కూటమి అభ్యర్థి వెంకట సాయి ని ఆశీర్వదించండి.. 21వ డివిజన్లో భవాని రవికుమార్, దేవానంద్ విస్తృత ప్రచారం కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు? నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ! మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....! సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ​ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన పిచ్చి మొక్కలు కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. టి సి వరుణ్.. పాతూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల! గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు

14వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ ప్రజలతో ముఖాముఖి

Select Suryaa Now
14వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ ప్రజలతో ముఖాముఖి

14వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ ప్రజలతో ముఖాముఖి

**ఎమ్మిగనూరు,**సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు పట్టణంలోని 14వ వార్డులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, స్వతంత్ర మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డి. నజీర్ అహమ్మద్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ పెద్దలు, యువత, స్థానిక ప్రజలతో మమేకమై వార్డులోని సమస్యలు, ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేయడమే తన లక్ష్యమని నజీర్ అహమ్మద్ తెలిపారు. గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవంతో పట్టణ పాలనపై అవగాహన ఉందని, అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.మైనార్టీల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమని అన్నారు.ఈ ఎన్నికల్లో స్వతంత్ర మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తనకు మద్దతు తెలిపి, గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని 14వ వార్డు ప్రజలతో పాటు ఎమ్మిగనూరు పట్టణ ఓటర్లను డి. నజీర్ అహమ్మద్ అభ్యర్థించారు. రాజా శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా