BREAKING
పరిణీతి చోప్రా సంచలన వ్యాఖ్యలు.. విమానంలో ఒంటరిగా ఏడ్చిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం! సేవా మిత్ర. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ మొక్కలు పంపిణీ సీబీఎఫ్‌సీ డేటా లీక్ కలకలం.. 500లకు పైగా సినిమాల సర్టిఫికేషన్ రికార్డులు బహిర్గతం! క్యూర్ పరిధిలో ప్రయాణికులకు టీ జీ ఎస్ ఆర్ టీ సీ సరికొత్త కానుక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఆనగంటి కృష్ణ 35వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం మీ ఇంటి ఆడపడుచు గా ఆశీర్వదించండి -మారుతి నగర్ ప్రచారంలో గాలి కావ్య మైనారిటీ యువత టీడీపీలో చేరిక యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టులపై బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతల ధ్వజం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం విజయమే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన కష్టపడి పనిచేశా కూలిగా ఓట్లు ఇవ్వండి -మారుతి నగర్ లో బ్యాంకు శాంతమ్మ ప్రచారం పాంచం జన్య సంకల్ప సభకు తరలిరావాలని పిలుపు అభివృద్ధి, సేవా దృక్పథం ఉన్న వారికే ఓటర్ల మద్దతు- మంత్రి ఎన్ఎండి ఫరూక్

పూలు పండ్లు అమ్మే వ్యాపారస్తుల వద్దకు వెళ్లి ఓటును అభ్యర్థించిన మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి.

Select Suryaa Now
పూలు పండ్లు అమ్మే వ్యాపారస్తుల వద్దకు వెళ్లి ఓటును అభ్యర్థించిన మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి.

కళ్యాణదుర్గం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పూలు, పండ్లు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ప్రత్యేకంగా కలిసి తనకు మద్దతుగా ఓటు వేయాలని అభ్యర్థించారు. వ్యాపారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ వ్యాపారాల ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారుల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించి గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి తనను చైర్‌పర్సన్‌గా గెలిపించాలని బుట్నా లక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ఓటర్లను కలిశారు.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.