BREAKING
ముందస్తు అరెస్టులు కాదు.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి రజనీకాంత్ 'ధర్మన్'లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. ఐదేళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్ రిపీట్! 3, 4వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ప్రచార సందడి పెళ్లిపై నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. దర్శకుడు కృష్ణవంశీతో బంధంపై ఆసక్తికర నిజాలు! ఎంపీటీసీ అభ్యర్థులు రేపటిలోగా బీఫార్మ్స్ సమర్పించాలి. అలాగే రేపే ఉపసంహరణకు చివరి గడువు. భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్ అలరించడానికి సిద్ధమైన'రణబాలి'చిత్రంలోని ఏందయ్యా సామీ పూర్తి వీడియో సాంగ్! ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య ఏఐ బూమ్ నిజమేనా? సిలికాన్ వ్యాలీని ప్రశ్నించిన నిఖిల్ కామత్! రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. కోయంబత్తూరు ఈవెంట్‌లో నటి రియాక్షన్ మరియు వైరల్ స్మైల్‌పై చర్చ! రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం.. వేలాది మంది మహిళా అభిమానులతో ధనుష్ సంచలన సమావేశం! ప్రభుదేవా, సిమ్రాన్ క్రేజీ కాంబినేషన్.. కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు! అసోం కూల్చివేతలపై బంగ్లాదేశ్ విపక్ష నేత ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి!

ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన... ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్

Select Suryaa Now
ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన... ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్

సూర్య  ధర్మపురి,:ధర్మపురి బస్‌స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రూ. 2.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆధునీకరణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.

*బస్‌స్టేషన్‌లో ఆధునిక సౌకర్యాలు*

ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రాజెక్టులో భాగంగా రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, సీసీ పేవ్‌మెంట్, గ్రానైట్ ఫ్లోరింగ్, భవనానికి ఏసీపీ క్లాడింగ్, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు, రూఫ్ స్లాబ్, సీలింగ్ మరమ్మతులు చేపట్టనున్నారు. అదేవిధంగా వర్షపు నీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి, పెయింటింగ్, పల్లపు ప్రాంతాల్లో కంకర వేయడం, ల్యాండ్‌స్కేపింగ్, విద్యుదీకరణ, పంప్‌సెట్‌తో కూడిన బోర్‌వెల్ ఏర్పాటు చేయనున్నారు.

*మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్టీసీ సేవల విస్తరణ*

*ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 360 కోట్ల ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలకు దాదాపు రూ. 13 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.

ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు విస్తరించడంతోపాటు బాసర, భద్రాచలం, ధర్మపురి, గూడెం, కాళేశ్వరం తదితర పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ధర్మపురి నుంచి ముంబైకి ఏసీ బస్సు నడిపే ప్రతిపాదనను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

*ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటుకు చర్యలు*

1993లో ప్రారంభమైన ధర్మపురి బస్‌స్టేషన్‌ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటు చేయాలన్న స్థానిక ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఎన్నికలకు ముందే డిపో నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కోరినట్లు వెల్లడించారు.

*పుష్కరాల అభివృద్ధికి రూ. 226 కోట్లు*

*మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ*

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలు, ఘాట్లు, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 10 కోట్లు, పుష్కర ఘాట్లు, బైపాస్ రహదారులు తదితర అభివృద్ధి పనులకు సుమారు రూ. 226 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, బస్‌స్టేషన్ ఆధునీకరణతో వారికి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆలయాలు, ఘాట్లు, రహదారుల అభివృద్ధితో పుష్కరాల సమయంలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు.

*నాణ్యతతో పనులు పూర్తి చేయాలి:: కలెక్టర్*

*జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ*

బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేపట్టి, నాణ్యత విషయంలో రాజీ పడకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వర్షపు నీటి పారుదల వంటి సదుపాయాలు సక్రమంగా అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ దినేష్,ఆర్.టి.సి. అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా  ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.