*మధిరలో బియ్యం ధరలకు కళ్లెం వేయాలి.*
మధిర.. సూర్య న్యూస్ :మధిర పట్టణంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని, అదే సమయంలో ధాన్యం ధరలు పెరిగినప్పుడు ఆ ప్రయోజనం రైతులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మెరుగైన ధర లభించాల్సి ఉండగా, మధ్యవర్తుల కారణంగా రైతులకు ఆశించిన లాభం దక్కకపోవడం, మరోవైపు వినియోగదారులు అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేయాల్సి రావడం ఆందోళన కలిగిస్తోందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ధాన్యం ధరల పెరుగుదల వల్ల రైతులకు న్యాయం జరగడంతో పాటు, బియ్యం ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారకుండా అధికారులు సమతుల్య చర్యలు చేపట్టాలని కోరారు. మధిర, పరిసర ప్రాంతాల్లో బియ్యం ధరల పెరుగుదలకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, మధ్యవర్తుల అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెటింగ్ వంటి చర్యలు ఉన్నాయో లేదో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.అక్రమ నిల్వలు గుర్తిస్తే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, పౌరసరఫరాల శాఖ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని కోరారు.రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కాలి. పెరిగిన ధరల ప్రయోజనం రైతులకే చేరాలి.. సామాన్యులకు నాణ్యమైన బియ్యం అందుబాటు ధరల్లో లభించాలి అనే లక్ష్యంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులకు, వినియోగదారులకు న్యాయం చేయాలని మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో పల్లపోతుల ప్రసాదు లింగంపల్లి అప్పారావు ఆదూరి అబ్రహం, మేడ గోపీనాథ్, షేక్ జానీ, వేమిరెడ్డి పిచ్చిరెడ్డి ఫైర్ మాచర్ల శ్రీనివాసరావు, సముద్రాల ఉపేందర్, కలర్స్ పాషా,ఒట్టే సైదులు,కొత్తూరు నరసింహారావు, శ్రీరామోజు శరత్ చంద్ర (మొగ్లీ) తదితరులు పాల్గొన్నారు.
సూర్య….. సీతారాం