BREAKING
మార్కాపురంలో జిల్లా ప్రజాప్రతినిధుల కీలక భేటీ మున్సిపల్ చైర్మన్ అభినందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి రెబల్ స్టార్ ప్రభాస్‌తో అలాంటి సినిమా చేయాలని ఉంది.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు! మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ రష్మిక మందన్న యాసపై నటి మధు ప్రశంసలు.. సౌత్ యాసను దాచుకోకుండా ధైర్యంగా మాట్లాడటంపై అరుదైన స్పందన! జనసేనలోకి కొనసాగుతున్న చేరికలు.. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితుడై పార్టీలో చేరిన యోగి.. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: టి.సి. వరుణ్ 7 ఏళ్లకే 12 భాషల్లో పట్టు.. ఆసిన్ కుమార్తె పెంపకంపై భర్త రాహుల్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! బడి పిల్లలకు శుభవార్త... మహాదేవపూర్ లో ఘనంగా ప్రారంభమైన ఉచిత అల్పాహారం! పాత రుణాలు చెల్లించినా.. మళ్లీ బకాయిల నోటీసులా? సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ మోసంతో ప్రజలను వంచించారు గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి - టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు భూసిమెట్ట విద్యార్థిని ఎంపిక రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పేదల సొంతింటి కలకు నాణ్యతా లోపాల ముప్పు! ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ని కలిసిన మున్సిపల్ చైర్మన్ ,వార్డు సభ్యులు

ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్

Select Suryaa Now
ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్

సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డిజిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసులో కామారెడ్డి పోలీసులు సంచలన విజయం సాధించారు. 5 ప్రత్యేక బృందాలతో 5 రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం రోజున ఆయన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర వెల్లడించారు.
మండల కేంద్రంలోని గాంధారి ప్రధాన రహదారిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద ఈనెల అక్టోబర్ 10న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నైటీలు, మాస్కులు ధరించి సీసీ కెమెరాలపై బ్లాక్ స్ప్రే కొట్టి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసి రూ.25,45,900 నగదు ఉన్న 5 బాక్సులతో పరారయ్యారు. దీనిపై గాంధారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా ఎస్పీ ఆదేశాలతో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజ్‌లు సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశారు. నిందితులు నల్ల స్కార్పియో వాహనంలో తిరుగుతూ పోలీసుల కళ్లుగప్పేందుకు నకిలీ నంబర్ ప్లేట్లు మారుస్తున్నారు. సెప్టెంబర్ లో కరీంనగర్ లో రెండు ఏటీఎంలలో చోరీ చేసినట్లు తేలింది. అక్టోబర్ 10న రాత్రి గాంధారి వచ్చే దారిలో ఓ వెల్డింగ్ షాప్ తాళం పగులగొట్టి ఆక్సిజన్ సిలిండర్, పరికరాలు దొంగిలించి ఆ తర్వాత ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. చోరీ అనంతరం స్కార్పియోలో మహారాష్ట్ర మీదుగా రాజస్థాన్ వైపు పారిపోయారు. కామారెడ్డి పోలీసులు ఇచ్చిన సమాచారంతో చేచాట్ పోలీసులు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా టైరు పేలడంతో వాహనం వదిలి నగదుతో పరారయ్యారు. అక్టోబర్ 20న సాయంత్రం రాజస్థాన్ లోని బరోడామేవ్ సమీపంలో భరత్పూర్ రోడ్డుపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రధాన నిందితుడు రషీద్(30)ను కామారెడ్డి బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ట్రాన్సిట్ వారెంట్ పై కామారెడ్డికి తీసుకొచ్చారు. అక్టోబర్ 21న చేచాట్‌లో వదిలేసిన స్కార్పియో వాహనం నుంచి గ్యాస్ కట్టింగ్ పరికరాలు, కత్తులు, ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు. రూ.29,400 నగదు, 2 మొబైల్ ఫోన్లు, నల్ల స్కార్పియో వాహనం, గ్యాస్ కట్టింగ్ నాజిల్, రెగ్యులేటర్, పైపులు, నకిలీ నంబర్ ప్లేట్లు, మాస్కులు, 3 కత్తులు, ఇనుప రాడ్. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు, పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజ్, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, లక్ష్మీకాంత్, అజార్‌లను ఈ సందర్భంగా జిల్లాఎస్పీ అభినందించారు.