రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలు...
సూర్య,ముస్తాబాద్: ముస్తాబాద్ గ్రామపంచాయతీ సిబ్బంది రాజనర్సు,సుధాకర్ ద్విచక్ర వాహనంపై సిరిసిల్ల నుంచి ముస్తాబాద్‌కు వస్తుండగా గూడెం గ్రామం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి బ్రేక్ వేయగా వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు.ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలయ్యాయి.