భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్: భూముల రీ-సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రైతులందరూ సహకరించాలని డిప్యూటీ తహసీల్దార్ సురేష్ సూచించారు. సోమవారం మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో రైతులకు భూ సర్వేపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. గ్రామ పరిధిలోని భూముల సర్వే ప్రక్రియ, రెవెన్యూ రికార్డుల వివరాలు, భూముల హద్దులు తదితర అంశాలపై రైతులకు వివరించారు. భూ సర్వేకు సంబంధించిన రికార్డులను పరిశీలించుకోవాలని, సర్వే ప్రక్రియలో అధికారులకు అవసరమైన సమాచారం అందిస్తూ సహకరించాలని సూచించారు. భూములకు సంబంధించిన వివరాలపై రైతులకు అవగాహన కల్పించి, సర్వే ద్వారా భూ వివరాలను స్పష్టంగా నిర్ధారించుకునేందుకు సహకరించాలని కోరారు.ఈ గ్రామసభలో స్థానిక సర్పంచ్ సంధ్య సుభాష్ గౌడ్, ఆర్‌ఐ సరిత, జీపీఓలు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సర్వేయర్ రాందాస్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.