ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ని కలిసిన మున్సిపల్ చైర్మన్ ,వార్డు సభ్యులు
ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ని కలిసిన మున్సిపల్ చైర్మన్ ,వార్డు సభ్యులు
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అచ్చాల తిరుపతమ్మ ,30 మంది వార్డు సభ్యులు ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ని అమరావతి గ్రౌండ్ లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు .మున్సిపల్ చైర్మన్ గా ,వార్డు సభ్యులుగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కి కృతఙ్ఞతలు తెలియజేశారు .ఈ సంధర్భంగా మున్సిపల్ చైర్మన్ ,వార్డు సభ్యులను ఎమ్యెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు షేక్ ఫిరోజ్ ,వై మనోజ్ రెడ్డి ,ఎన్ అంజినాయుడు ,కొట్టే నాగ ప్రసాద్ ,బుల్లా బాలబాబు ,కె నాగమణి ,ఎమ్ మధుబాబు ,బేరి నాగేంద్ర ,వై దైవ కటాక్షం ,నక్కా కొండమ్మ ,బి పార్వతి ,బి రామసుబ్బయ్య ,నరాల రమాదేవి ,షేక్ ఫయాజ్ ,షేక్ గౌసియా బేగం ,ఎన్ సుధీర్ ,షేక్ బిస్మిల్లా ,షేక్ ఖాసిం పీరా ,జె సాలమ్మ ,షేక్ సలీమాభి ,షేక్ షాహిదా ,షేక్ వాజిదా ,బి శ్రీలత ,జి శ్యామలా దేవి ,ఎం రత్తమ్మ ,వెన్నా రమాదేవి ,గోనుగుంట్ల పవన్ కుమార్ ,కె ఆదిలక్ష్మి ,షేక్ ఫాతిమా ,ఎస్ వెంకట లక్ష్మి రాజ్యం పాల్గొన్నారు .