టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు విజయదశమి శుభాకాంక్షలు
సంగారెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను పటాన్‌చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహేష్ కుమార్ గౌడ్‌కు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ ఆయనను శాలువాతో సత్కరించారు. విజయదశమి పండుగ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని ఆకాంక్షించారు. ఈ మర్యాదపూర్వక భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.