వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య
వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి
మహర్షి వాల్మీకి అందించిన రామాయణ మహాకావ్యం మానవాళికి ధర్మం, నైతిక విలువలు, సన్మార్గంలో జీవించే విధానాన్ని నేర్పించిన గొప్ప గ్రంథమని ఏవో కృష్ణయ్య కొనియాడారు. .నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రామాయణ మహాకావ్యాన్ని సంస్కృతంలో తొలి రచన చేసిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ...మహర్షి వాల్మీకి ఆలోచనలు, మార్గదర్శకత్వం సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిసిఎస్ సీఐ శంకర్,ఎస్ఐలు రమేష్, శ్రీనివాస్ లతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్