రాష్ట్రస్థాయి పోటీలకు పథకమూరు విద్యార్థులు.
సూర్య న్యూస్ దర్శి.
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు మండలంలోని పథకమురు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు.
మార్కాపురంలో జరిగినటువంటి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ మీటిలో పథకమూరు విద్యార్థులకు ప్రథమ స్థానము హేమర్త్రోలో మూడవ స్థానం హేమర్ త్రోలో, లాంగ్ జంప్ లో మూడవ స్థానము, ట్రిపుల్ జంప్ లో, నాలుగవ స్థానము పొంది, ఈ నెల 28 కర్నూల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు .మొదటి స్థానం వచ్చిన విద్యార్థి గుంటక సాయి తేజ రెడ్డి, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు, సిహెచ్ శ్రీనివాసులు , పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, ఎస్ అంజిరెడ్డి క్రీడాకారులను అభినందించారు.