53వ డివిజన్లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్.. కార్యకర్తల కోలాహలం.. డప్పుల మోతతో సందడిగా ప్రారంభోత్సవం
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- నగరంలోని 53వ డివిజన్‌లో కూటమి ఎన్నికల కార్యాలయాన్ని జనసేన జిల్లా అధ్యక్షుడు, అహుడ చైర్మన్ టి.సి. వరుణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు, వీర మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కార్యాలయ ప్రారంభోత్సవానికి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కూటమి అభ్యర్థి తేజ రాయల్‌కు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పుల మోతతో డివిజన్‌లో సందడి నెలకొంది.
ఈ సందర్భంగా టి.సి. వరుణ్ మాట్లాడుతూ, కూటమి అభ్యర్థి తేజ రాయల్‌కు మద్దతు తెలిపి, అఖండ మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలకు టిసి వరుణ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..