BREAKING
నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై ఘట్టమనేని గౌతమ్ రివ్యూ.. సూపర్ స్టార్ వారసుడి ప్రశంసలు! విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు.. తాగునీటి సమస్యే కారణం! విజయ్ సేతుపతి ‘బత్తా’ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్! కూటమి సర్కార్‌కు ప్రజల ఆగ్రహం తప్పదు-మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి రెడ్డి 9 వార్డు వెస్ట్ మారెమ్మపల్లి లో చైర్మన్ అభ్యర్థితో కలిసి ఓటర్లను కలిసిన కూటమి అభ్యర్థులు. ముకరంపుర లో 'TS ఇన్సూరెన్స్ హబ్' ప్రారంభించిన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పలమనేరు 6, 7, 8, 9వ వార్డుల్లో టీడీపీ ప్రచారం జోరు ఎస్ ఎల్ ఎన్ ఫేజ్‌–2 పటేల్ గుడ్డ లో రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తాం: మేయర్ కొలగాని శ్రీనివాస్. కళ్యాణదుర్గం లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు జోరుగా ఇంటింటి ప్రచారం. 31 గిన్నిస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని మీ ఆదరణ.. ఆశీస్సులు నాపై చూపండి ప్రచార కార్యక్రమంలో టిడిపి 10 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ తాజ్ Weekly Horoscope 25 Oct 2026 నుండీ 31 Oct 2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) అవ్వతాత..అన్న అక్క.. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. కౌన్సిలర్ అభ్యర్థి సబిహా ప్రచారం ఆస్ట్రేలియా ఎన్నారై టిడిపి సెల్ ప్రెసిడెంట్ గా వీరపనేని వాణి.

ఆదర్శ వెల్దుర్తియే లక్ష్యం: తిరివీధి రమేష్‌ శెట్టి

Select Suryaa Now
ఆదర్శ వెల్దుర్తియే లక్ష్యం: తిరివీధి రమేష్‌ శెట్టి

తాత, తండ్రుల సేవలను పునికిపుచ్చుకున్న కుటుంబ నేపథ్యం

– అభివృద్ధి, పారిశుధ్యం, స్వచ్ఛమైన తాగునీరే ప్రధాన ధ్యేయం

– వెల్దుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా ప్రజల ముందుకు…

వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:రాజకీయాలకు అతీతంగా, ఎలాంటి స్వలాభం లేకుండా వెల్దుర్తి మేజర్ పంచాయతీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని ప్రముఖ పారిశ్రామికవేత్త, సర్పంచ్‌ అభ్యర్థి తిరివీధి రమేష్‌ శెట్టి తెలిపారు. వెల్దుర్తి అభివృద్ధి సాధనే లక్ష్యంగా ఆయన గ్రామాభివృద్ధి ప్రణాళికను వెల్లడించారు.

సేవా నిరతి కలిగిన కుటుంబ నేపథ్యం:

వెల్దుర్తి పంచాయతీకి 10 ఏళ్లపాటు సర్పంచ్‌గా సేవలందించిన దివంగత తిరివీధి నారాయణ శెట్టి, అనంతరం 18 సంవత్సరాల పాటు నిస్వార్థ సేవలు అందించి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన దివంగత తిరివీధి శివయ్య శెట్టి గార్ల ఆశయ సాధనకు ఆయన కుమారుడైన తిరివీధి రమేష్‌ శెట్టి శ్రీకారం చుట్టారు. కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే తమ కుటుంబ సిద్ధాంతమని ఈ సందర్భంగా రమేష్‌ శెట్టి స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలపై ఆచరణాత్మక ప్రణాళిక:

స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తవుతున్నా నేటికీ గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా లభించకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఆధునిక రీతిలో అండర్‌గ్రౌండ్ (గ్రౌండ్ లెవెల్) డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి పారిశుధ్యాన్ని పూర్తిగా మెరుగుపరుస్తామని చెప్పారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

ప్రధాన వాగ్దానాలు & ప్రతిపాదనలు:

స్వచ్ఛమైన తాగునీరు: ప్రతి ఒక్కరికీ ఉచితంగా, సురక్షితమైన తాగునీటి సరఫరా. ఆధునిక డ్రెయినేజీ: మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా అండర్‌గ్రౌండ్ కాలువల నిర్మాణం.పట్టణ స్థాయి కాంతులు: పంచాయతీ పరిధిలో వీధిదీపాల అలంకరణతో పట్టణాలకు దీటుగా రూపురేఖల మార్పు.మార్కెట్ పునరుద్ధరణ: ప్రజా రవాణా సమస్యలకు పరిష్కారం, మార్కెట్ స్థలాల అభివృద్ధి ద్వారా చిరు వ్యాపారులకు శాశ్వత ఉపశమనం.పన్నుల భారం తగ్గించడం: పేద, మధ్యతరగతి కుటుంబాలు మరియు వ్యాపారులపై అదనపు పన్నుల భారం పడకుండా ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు."వెల్దుర్తి సమగ్ర అభివృద్ధి కోసం, నిస్వార్థంగా సేవ చేసేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. వెల్దుర్తి రూపురేఖలు మార్చడానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి" అని తిరివీధి రమేష్‌ శెట్టి ప్రజలను అభ్యర్థించారు. సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం