44వ డివిజన్‌లో కూటమి నేతల విస్తృత ప్రచారం.మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్,
అనంతపురం కలెక్టరేట్ ..44వ డివిజన్‌లో కూటమి నేతల విస్తృత ప్రచారం.మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, డివిజన్ అభ్యర్థి పొదిలి బాబురావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం
అనంతపురం: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 44వ డివిజన్‌లో కూటమి నాయకులు విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, అహుడ చైర్మన్ టీ.సీ. వరుణ్, కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, టీడీపీ నాయకుడు అరుణ్ చౌదరి, జనసేన సీనియర్ నాయకుడు కాయగూరల లక్ష్మీపతి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌తో పాటు 44వ డివిజన్ అభ్యర్థి పొదిలి బాబురావుకు మద్దతుగా ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రజలకు వివరిస్తూ నాయకులు ఓటర్లతో మమేకమయ్యారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ నగరాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ప్రచారంలో పేర్కొన్నారు.కూటమి అభ్యర్థుల ప్రచారంలో మహిళా నాయకులు, వీరమహిళల భాగస్వామ్యం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ వేణు.