ఎన్నికల విధులపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:స్థానిక మండల ప్రాజె పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు (PO), సహాయ ప్రిసైడింగ్ అధికారులకు (APO) ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.స్థానిక PM శ్రీ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) మరియు మాస్టర్ ట్రైనర్లు (MOTs) హాజరై పోలింగ్ ప్రక్రియ, పత్రాల నిర్వహణ, ఓటింగ్ విధానం మరియు ఎన్నికల నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (Head Masters), ఉపాధ్యాయులు (Teachers) మరియు ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం