సిఐడి పోలీసుల అదుపులో నలుగురు రైస్ మిల్లర్లు
సూర్య,హుజురాబాద్.కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్ లోని హుజురాబాద్, జమ్మికుంట లలో సిఐడి అధికారులు సీఎంఆర్ సరఫరాలో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సంబంధం ఉన్న నలుగురు రైస్ మిల్లర్లను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. హుజురాబాద్ పట్టణంలో వరలక్ష్మీ రైస్ మిల్ యజమాని కల్లూరు కృష్ణమూర్తి, జమ్మికుంట పట్టణానికి చెందిన వ్యాపారులు మల్లికార్జున్, సంపత్, మధులను రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడులు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎఫ్సీఐకు బియ్యాన్ని పంపే విషయంలో వీరు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సప్లై కి సన్న బియ్యాన్ని పంపే క్రమంలో వాటి స్థానంలో దొడ్డు బియ్యాన్ని పంపినట్లు తెలిసింది. సదరు వ్యాపారులు ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో అధికారులు ఆగ్రహం చెందారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ భారీ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించగా, రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నలుగురు మిల్లర్లను నేరుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
మిల్లర్ల ను అదుపులోకి తీసుకోవడంతో రైస్ మిల్ వ్యాపారస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.