ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో ఆదివారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రోటరీ క్లబ్ వారి సమన్వయంతో మరియు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రంగారెడ్డి మరియు గ్రామ సమాజ సేవకురాలు దేశాయి పద్మజా రెడ్డి రోటరీ క్లబ్ డైరెక్టర్లు డాక్టర్లు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం వలన ప్రజలకు మెగా క్యాన్సర్ కార్డియాక్ గడ్డం సాధారణ ఆరోగ్య సేవలు దర్భాస ఒక క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష జనరల్ ఫిజీషియన్ సాధన ఆరోగ్య పరిక్షలు టుడే ఎక్కువ మొదలగునై నిర్వహించబడునని వారు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మరియు మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.