BREAKING
తుఫాన్‌ ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన 18వ వార్డులో డాక్టర్ శ్రీరామ్ రెడ్డికి ప్రజల బ్రహ్మరథం గడపగడపకు విస్తృత ప్రచారం.. వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యం వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. 20వ వార్డులో నూరి ఇక్బాల్ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం బ్లాస్టింగ్ దెబ్బకు ఇళ్లకు బీటలు! చౌడాపూర్ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ముబీన్ ఉత్కంఠ మారిన కోనసీమ జడ్పీ పీఠం లక్ష్మీనగర్‌లో 13వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రచారం అమెరికాలో ఓటర్ల జాబితాలో విదేశీయులను గుర్తించాలని ట్రంప్ యంత్రాంగం ఆదేశం కల్వరాయన్ కొండల్లో కుండపోత వర్షాలు.. గోముఖి డ్యామ్‌కు పోటెత్తిన వరద.. కార్నెల్ విశ్వవిద్యాలయ బాధితురాలి గుర్తింపు గోప్యంగా ఉంచాలని కోర్టు తీర్పు కెనడాలో టెక్ సంస్థ హైలాండ్ వ్యాలీ కాపర్ మైన్‌లో కార్మికుల సమ్మె ప్రారంభం చాక్లెట్ల ధరల పెంపు వ్యూహం బెడిసికొట్టింది, అంగీకరించిన లిండ్ట్ సంస్థ చైర్మన్ బ్రిటన్ నూతన బడ్జెట్ ప్రకటనకు వేళాయే అక్టోబర్ 30న థియేటర్లలోకి యోగిబాబు సింగారం.. ఘనంగా ఆడియో వేడుక!

మునుగోడు ఎమ్మెల్యే మూడేళ్ల కృషి ఫలితమే ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం: కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప

Select Suryaa Now
మునుగోడు ఎమ్మెల్యే మూడేళ్ల కృషి ఫలితమే ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం: కాంగ్రెస్ పార్టీ  మండల ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప

మునుగోడు ఎమ్మెల్యే మూడేళ్ల కృషి ఫలితమే ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం: కాంగ్రెస్ పార్టీ  మండల ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప

????ఏదుల నుంచి డిండి, శివన్నగూడెం ప్రాజెక్టులకు కృష్ణా జలాల తరలింపునకు ప్రభుత్వ ఆమోదం హర్షణీయం

????ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు  

మునుగోడు,మేజర్ న్యూస్:

మునుగోడు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత దాదాపు మూడేళ్లుగా చేసిన నిరంతర కృషి ఫలితంగా ఏదుల నుంచి డిండి ప్రాజెక్టు, శివన్నగూడెం ప్రాజెక్టులకు కృష్ణా జలాలను తరలించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడు ప్రాంతం ఎన్నో ఏళ్లుగా సాగునీరు, తాగునీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతంగా కూడా ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని పేర్కొన్నారు. నీటి వనరులు లేక అనేక ఎకరాల భూములు బీడుగా మారుతున్నాయని, రైతులు సాగు కోసం వర్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.
ఈ సమస్యలను పరిష్కరించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేక పర్యాయాలు సంబంధిత అధికారులు, ఇంజనీర్లతో చర్చలు జరిపి, ప్రాజెక్టుల అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దాదాపు మూడేళ్లుగా ఆయన చేసిన ప్రయత్నాలు, పట్టుదల ఫలితంగా కృష్ణా జలాల తరలింపునకు ప్రభుత్వం ఆమోదం తెలపడం నియోజకవర్గ ప్రజల్లో కొత్త ఆశలు నింపిందని పేర్కొన్నారు.అపర భగీరథుడు గంగను భూమిపైకి తీసుకొచ్చిన విధంగా మునుగోడు ప్రాంతానికి కృష్ణమ్మను తీసుకురావాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి చేరితే బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారుతాయన్నారు. రైతుల కష్టాలు తగ్గి, ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుందన్నారు. మునుగోడు భవిష్యత్తుకు ఈ నిర్ణయం ఎంతో కీలకమైనదన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం త్వరగా కార్యరూపం దాల్చి ప్రాజెక్టుల ద్వారా నీరు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. మునుగోడు ప్రాంత అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి సాగునీటి ప్రాజెక్టులు ఎంతో కీలకమని, కృష్ణా జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు.