అభివృద్ధి ని మరచిన సర్పంచ్ పై చర్యలు చేపట్టాలి...ఉప సర్పంచ్, వార్డు సభ్యుల డిమాండ్
మణుగూరు ఆర్ సి సూర్య ; మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ సర్పంచ్ పై వ్యతిరేకత రోజు రోజుకీ పెరుగుతోంది.సర్పంచ్ కలం కల్పన వ్యవహార తీరుపై ఉప సర్పంచ్,వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా సర్పంచ్ భర్త బాడిష సతీష్ ఇసుక ర్యాంపుల వద్ద పంచాయతీ అభివృద్ధి పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం ఒక్కో లారీకి రూ 1300 చొప్పున వసూలు చేసి పట్టాలు కట్టే వారికి వెయ్యి రూపాయలు,పంచాయతీ అభివృద్ధికి వంద రూపాయలు అని చెబుతున్నారు. కానీ మరో రెండు వందల రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారో ఎవరికీ చెప్పడంలేదన్నారు.రామానుజవరo పంచాయతీ అభివృద్ధి పేరుతో లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారన్నారు.అంతే కాకుండా సర్పంచ్ గా..సొసైటీ చైర్మన్ గా రెండు పదవుల్లో కొనసాగుతూ..మోసం చేస్తున్నారని ఉప సర్పంచ్ కొడారి రాణి,వార్డు సభ్యులు కొర్సా సుస్మిత, రట్టి సతీష్,సున్నం సునీత,బాలిన లింగమ్మ,గనిబోయిన సుస్మిత మరియు మడకం కృష్ణ లు ఆరోపించారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి సూర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా