BREAKING
కూటమిని ఆదరించి అభివృద్ధికి బాటలు వేయండి : రెండవ వార్డ్ జనసేన అభ్యర్థిని తమ్మిశెట్టి కళావతి అభివృద్ధి ని మరచిన సర్పంచ్ పై చర్యలు చేపట్టాలి...ఉప సర్పంచ్, వార్డు సభ్యుల డిమాండ్ డబుల్ ఇంజిన్ పాలనతో శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి : 35 వార్డ్ కూటమి అభ్యర్థిని ఎస్.విద్యాధరి స్పష్టం విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో బిల్డింగ్ ప్లానింగ్,డ్రాయింగ్ అంశంపై వర్క్ షాప్ 21వ వార్డులో జనజాతరను తలపించిన కూటమి ప్రచారం : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి నాగూర్ వలికి ప్రజాదరణ మదనపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరాలి : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం మదనపల్లి మున్సిపాలిటీలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం పక్కా : ప్రచారంలో వైఎస్ఆర్సిపి అతిరథ మహారధుల ధీమా మహిళా సర్పంచుల శిక్షణతో గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలు 30వ వార్డులో మహబూబ్ బాషా వినూత్న ప్రచారం ఇంటింటా ప్రచారంతో ప్రజల్లోకి చంద్రకళ రమేష్ గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026

మదనపల్లి మున్సిపాలిటీలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం పక్కా : ప్రచారంలో వైఎస్ఆర్సిపి అతిరథ మహారధుల ధీమా

Select Suryaa Now
మదనపల్లి మున్సిపాలిటీలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం పక్కా : ప్రచారంలో వైఎస్ఆర్సిపి అతిరథ మహారధుల ధీమా

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి మున్సిపాలిటీలో మరోసారి వైసీపీ జెండా ఎగరాలని ఆ పార్టీ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు.పట్టణంలో రెండవ వార్డు ప్రచారంలో కూటమి ప్రభుత్వ తీరుపై ఓటర్లు ఆగ్రహం ఎంత పెద్దఎత్తున ఉన్నారో తెలుస్తోందన్నారు.వైసీపీకి మద్దతు ఇస్తున్న ఓటర్లుగత వైసీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం,తల్లికి వందనం,అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన ఘనత కేవలం జగనన్నదేనని రెండో వార్డ్ అభ్యర్థిని కాళహస్తి స్వేత కొనియాడారు.అయితే కూటమి ప్రభుత్వంలో నేతన్న లకు మోసం,తల్లికి వందనంలోనూ మోసమేనని ప్రతీసారి మోసం చేసే ప్రభుత్వాన్ని కుర్చీ దించే రోజులు వచ్చాయన్నారు.వైఎస్సార్సీపీ ప్రచారంలో భాగంగా ఓటర్లు ఎంతో సంతోషంగా ఉత్సాహంతో  ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి,వేయిస్తామని తెలుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వైకాపా సమన్వయకర్త నిసార్ అహ్మద్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నా,చైర్మన్ అభ్యర్థి జింకా చలపతి,వైఎస్సార్సీపీ యువనేత,మాజీ శాసనమండలి సభ్యులు బి.నరేష్ కుమార్ రెడ్డి కుమారుడు బి.శశాంక్ రెడ్డిలు రెండవ వార్డు అభ్యర్థిని బలపరిచి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.రెండవ వార్డును గెలిచి పార్టీ పెద్దలకు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి,పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి,నిసార్ అహ్మద్,నరేష్ కుమార్ రెడ్డి,తిప్పారెడ్డి,బావాజాన్,శశాంక్,పార్టీ కుటుంబ సభ్యులందరికీ బహుమతిగా అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రేపన నాగరాజు,3వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిని రుక్సార్ సుల్తానా,చిప్పిలి మల్లికార్జున రెడ్డి,రేపన ముని,వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి