BREAKING
ఏఐ టాలెంట్ వేటలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్:అగ్రశ్రేణి ఇంజనీర్ల కోసం బిలియన్ల డాలర్ల ప్యాకేజీలు.. ఎవరి పెట్టుబడులు అత్యధికం? ఆస్ట్రేలియాలో అట్టహాసంగా ప్రారంభమైన సిడ్నీ నూతన అంతర్జాతీయ విమానాశ్రయం బ్లూటూత్ SBC vs AAC vs LDAC: వీటిలో ఏ ఆడియో కోడెక్ అత్యుత్తమం? నాణ్యత, పనితీరులో ప్రధాన తేడాలు ఇవే! సౌదీ అరేబియా రాజధాని రియాద్ విమానాశ్రయంపై హూతీల హెచ్చరికలు తీవ్రతరం కూటమిని ఆదరించి అభివృద్ధికి బాటలు వేయండి : రెండవ వార్డ్ జనసేన అభ్యర్థిని తమ్మిశెట్టి కళావతి అభివృద్ధి ని మరచిన సర్పంచ్ పై చర్యలు చేపట్టాలి...ఉప సర్పంచ్, వార్డు సభ్యుల డిమాండ్ డబుల్ ఇంజిన్ పాలనతో శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి : 35 వార్డ్ కూటమి అభ్యర్థిని ఎస్.విద్యాధరి స్పష్టం విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో బిల్డింగ్ ప్లానింగ్,డ్రాయింగ్ అంశంపై వర్క్ షాప్ 21వ వార్డులో జనజాతరను తలపించిన కూటమి ప్రచారం : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి నాగూర్ వలికి ప్రజాదరణ మదనపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరాలి : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం మదనపల్లి మున్సిపాలిటీలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం పక్కా : ప్రచారంలో వైఎస్ఆర్సిపి అతిరథ మహారధుల ధీమా మహిళా సర్పంచుల శిక్షణతో గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలు 30వ వార్డులో మహబూబ్ బాషా వినూత్న ప్రచారం ఇంటింటా ప్రచారంతో ప్రజల్లోకి చంద్రకళ రమేష్ గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు

డబుల్ ఇంజిన్ పాలనతో శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి : 35 వార్డ్ కూటమి అభ్యర్థిని ఎస్.విద్యాధరి స్పష్టం

Select Suryaa Now
డబుల్ ఇంజిన్ పాలనతో శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి : 35 వార్డ్ కూటమి అభ్యర్థిని ఎస్.విద్యాధరి స్పష్టం


మదనపల్లి,మేజర్ న్యూస్ : కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పాలనతో శరవేగంగా ఏపీ అభివృద్ధి సాధిస్తోందని 35 వార్డు కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థిని శనివారపు విద్యాదరి స్పష్టం చేశారు.శనివారం వార్డు పరిధిలో కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాదరి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కలయికలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి,ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తోందని కొనియాడారు.త్వరలో జరుగబోవు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే వికసిత్ భారత్ - వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుందన్నారు.మదనపల్లి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని నవంబర్ 1వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 35వ వార్డు అభ్యర్థి అయిన తనకు కమలం గుర్తుపై,కూటమి చైర్మన్ అభ్యర్థి అయిన శ్రీరామ్ చినబాబుకు సైకిల్ గుర్తుపై ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆమె వెల్లడించారు.ఈ కార్యక్రమంలో శనివారపు జయచంద్రా రెడ్డి,కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.