21వ వార్డులో జనజాతరను తలపించిన కూటమి ప్రచారం : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి నాగూర్ వలికి ప్రజాదరణ
మదనపల్లె,మేజర్ న్యూస్ : పట్టణంలో కూటమి అభ్యర్థుల మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు జోరు అందుకున్నాయి.అందులో భాగంగా శనివారం 21వ వార్డులు కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి నాగూర్ వలి (షో ఆప్ శీనా)కు మద్దతుగా ప్రచారం జన జాతరను తలపించింది.ఈ ప్రచారానికి జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి,టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,రేగడి ప్రసాద్ కుమార్,సత్య ప్రసాద్,రామాంజనేయులు,రాటకొండ గగన్,మహబూబ్ ఖాన్,టెంపర్ రాజేష్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాందాస్ చౌదరి,విద్యాసాగర్ మాట్లాడుతూ ఏపీలో కూటమి పాలన సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు.సంక్షేమ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలయికలో రాష్ట్ర అభివృద్ధి డబుల్ ఇంజిన్ స్పీడుతో దూసుకుపోతుందన్నారు.ఇక మదనపల్లి జిల్లాగా చేసి ఇక్కడ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చడం జరిగిందన్నారు.21 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి నాగూర్ వలి చురుకైన యువనేత అని,ప్రజా సమస్యల పరిష్కారానికి ముందు వరుసలో ఉంటారన్నారు.కౌన్సిలర్ అభ్యర్థికి,కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకు సైకిల్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం అభ్యర్థి నాగూర్ వలి మాట్లాడుతూ ఓటర్లు తనకు ఒక అవకాశం కల్పిస్తే నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని,వార్డు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు.తనకు మద్దతుగా ప్రచారానికి విచ్చేసిన కూటమి ముఖ్య నాయకులు,కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి