BREAKING
కూటమిని ఆదరించి అభివృద్ధికి బాటలు వేయండి : రెండవ వార్డ్ జనసేన అభ్యర్థిని తమ్మిశెట్టి కళావతి అభివృద్ధి ని మరచిన సర్పంచ్ పై చర్యలు చేపట్టాలి...ఉప సర్పంచ్, వార్డు సభ్యుల డిమాండ్ డబుల్ ఇంజిన్ పాలనతో శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి : 35 వార్డ్ కూటమి అభ్యర్థిని ఎస్.విద్యాధరి స్పష్టం విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో బిల్డింగ్ ప్లానింగ్,డ్రాయింగ్ అంశంపై వర్క్ షాప్ 21వ వార్డులో జనజాతరను తలపించిన కూటమి ప్రచారం : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి నాగూర్ వలికి ప్రజాదరణ మదనపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరాలి : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం మదనపల్లి మున్సిపాలిటీలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం పక్కా : ప్రచారంలో వైఎస్ఆర్సిపి అతిరథ మహారధుల ధీమా మహిళా సర్పంచుల శిక్షణతో గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలు 30వ వార్డులో మహబూబ్ బాషా వినూత్న ప్రచారం ఇంటింటా ప్రచారంతో ప్రజల్లోకి చంద్రకళ రమేష్ గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026

మదనపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరాలి : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం

Select Suryaa Now
మదనపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరాలి : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం


మదనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరాలని కూటమి శ్రేణులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.శనివారం మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లెలోని కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు) నివాసానికి మంత్రి విచ్చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి వార్డులలో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేయాలన్నారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డులలో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.కూటమి నాయకులు ఐకమత్యంగా ముందుకు సాగితే విజయం సులభం అవుతుందన్నారు.చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు ప్రచార శైలిని ఆయన ప్రశంసించారు.మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలవడానికి కూటమి నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి,గంగారపు రామ్మూర్తి నాయుడు,సీడ్ మల్లికార్జున నాయుడు,గుండ్లపల్లి యోగేశ్వర బాబు (పెదబాబు),మండ్యం ప్రభాకర్,రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),పోతబోలు వెంకటేష్,బీజేపి యువ నాయకులు శ్రీకాంత్,15వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి,మదనపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు సిరివేలు చరణ్ కుమార్,కౌన్సిలర్ అభ్యర్థులు రామిశెట్టి రెడ్డి కేశవ,బండి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి