సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ :సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ (భాస్కర పరీక్షలు)ను కళ్యాణ్ హంపీ థియేటర్‌లో నిర్వహించారు. అక్టోబర్ 24, 25 తేదీలలో నిర్వహించే పరీక్షల్లో భాగంగా 6, 7 సంవత్సరాల విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నాట్య గురువు పద్మ కల్యాణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల నృత్య ప్రతిభను ప్రోత్సహించేందుకు, వారి కళా నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఉపాధ్యాయులు, కళాభిమానులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించాలని ఆమె కోరారు.