నూతన జిల్లా కార్యవర్గ సభ్యులను అభినందించిన మర్రి శశిధర్ రెడ్డి
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : ఇటీవల భారతీయ జనతా పార్టీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా కార్యవర్గంలో వివిధ పదవులు పొందిన నాయకులు ఈ రోజు బేగంపేట్ లోని సనత్ నగర్ నియోజకవర్గం బిజెపి కార్యాలయములో మాజీ మంత్రి వర్యులు , ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షులు మరియు బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డిని* మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులైన వి. దయానంద్ రావు , గుంటి సత్యనారాయణ , ఆకుల రమేష్ , ఎన్. చంద్రపాల్ రెడ్డి , జిల్లా మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా నియమితులైన శ్రీమతి కిరీట , జిల్లా కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్తగా నియమితులైన దశరథ్ , జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ గా నియమితులైన సి. కె. శ్రవణ్ అలాగే సనత్ నగర్ డివిజన్ ఓ బి సి మోర్చా అధ్యక్షులుగా నియమితులైన శ్రీనివాస్ ఈ బృందంలో ఉన్నారు.
ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి వారందరినీ శాలువాలతో సత్కరించి, మిఠాయిలు తినిపించి హృదయపూర్వకంగా అభినందించారు. అనంతరం మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ ఇచ్చిన పదవులను బాధ్యతగా స్వీకరించి, ప్రజలకు చేరువగా ఉంటూ వారికి అవసరమైన మౌలిక వసతులు మరియు ఇతర సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేసి, మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
అనంతరం వారందరూ రాష్ట్ర బిజెపి యువ నాయకులు మర్రి పురురవ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన కూడా నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నెమలి ఆనంద్ గారు మరియు ఇతర బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.