లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు
సనత్‌నగర్,మేజర్ న్యూస్:సనత్‌నగర్ డివిజనులోని లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం జరిగింది. శనివారం జరిగిన కార్యక్రమంలో డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వందకు పైగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు పత్రాలను తీసుకున్నారు.వాటిల్లో 60 పత్రాలను పూర్తి చేసి బాల్ రెడ్డికి అందజేశారు. మిగిలినవి ఆదివారం అందజేస్తామని తెలియజేశారు.అనంతరం బాల్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని కమిటీ సభ్యులకు సూచించారు.ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వృథా చేయకుండా వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో లోధా అపార్ట్మెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ ఎం.వి.శర్మ, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్,సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ సుబ్బారావు,గోపికృష్ణ,
తదితరులు పాల్గొన్నారు..