BREAKING
తుఫాన్‌ ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన 18వ వార్డులో డాక్టర్ శ్రీరామ్ రెడ్డికి ప్రజల బ్రహ్మరథం గడపగడపకు విస్తృత ప్రచారం.. వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యం వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. 20వ వార్డులో నూరి ఇక్బాల్ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం బ్లాస్టింగ్ దెబ్బకు ఇళ్లకు బీటలు! చౌడాపూర్ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ముబీన్ ఉత్కంఠ మారిన కోనసీమ జడ్పీ పీఠం లక్ష్మీనగర్‌లో 13వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రచారం అమెరికాలో ఓటర్ల జాబితాలో విదేశీయులను గుర్తించాలని ట్రంప్ యంత్రాంగం ఆదేశం కల్వరాయన్ కొండల్లో కుండపోత వర్షాలు.. గోముఖి డ్యామ్‌కు పోటెత్తిన వరద.. కార్నెల్ విశ్వవిద్యాలయ బాధితురాలి గుర్తింపు గోప్యంగా ఉంచాలని కోర్టు తీర్పు కెనడాలో టెక్ సంస్థ హైలాండ్ వ్యాలీ కాపర్ మైన్‌లో కార్మికుల సమ్మె ప్రారంభం చాక్లెట్ల ధరల పెంపు వ్యూహం బెడిసికొట్టింది, అంగీకరించిన లిండ్ట్ సంస్థ చైర్మన్ బ్రిటన్ నూతన బడ్జెట్ ప్రకటనకు వేళాయే అక్టోబర్ 30న థియేటర్లలోకి యోగిబాబు సింగారం.. ఘనంగా ఆడియో వేడుక!

అక్టోబర్ 30న థియేటర్లలోకి యోగిబాబు సింగారం.. ఘనంగా ఆడియో వేడుక!

Select Suryaa Now
అక్టోబర్ 30న థియేటర్లలోకి యోగిబాబు సింగారం.. ఘనంగా ఆడియో వేడుక!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కోలీవుడ్ హాస్య నటుడిగా అడుగుపెట్టి ప్రస్తుతం హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాక్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేవీ కదిరవేలు దర్శకత్వం వహిస్తుండగా, ఏఎస్ రమణ బాలాజీ మరియు పద్మావతి గాంధీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు తేదీ ఖరారు కావడంతో పాటు చిత్ర యూనిట్ ఘనంగా ఆడియో వేడుకను నిర్వహించింది.

ఈ సినిమాలో యోగిబాబు సింగారం అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలు, సంచార జాతుల చరిత్ర అలాగే రాజకీయ అంశాలను మేళవించి దర్శకుడు ఈ కథను తెరకెక్కించారు. ఈ సినిమాకు శ్యాం సీఎస్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే అంటే అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ తరుణంలో చెన్నైలో నిర్వహించిన ఆడియో రిలీజ్ వేడుకకు కోలీవుడ్ ప్రముఖులు ముఖ్య అతితులుగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర విశేషాలను పంచుకున్న దర్శకుడు, నటీనటులు సినిమాపై తమలో ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ చిత్ర నిర్మాణం వెనుక విస్తృతమైన పరిశోధన ఉందని, కేవలం వినోదం మాత్రమే కాకుండా సామాజిక స్పృహ కలిగించేలా ఈ కథను రూపొందించామని దర్శకుడు కదిరవేలు వెల్లడించారు. కుటుంబ సమేతంగా థియేటర్లలో కూర్చుని చూడదగ్గ చక్కని చిత్రమిని ఆయన పేర్కొన్నారు. ఇక హీరో యోగిబాబు మాట్లాడుతూ తనకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, దివంగత నటులు మనోబాల, మారిముత్తులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, అందరూ థియేటర్లలో సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.