BREAKING
ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన... ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి... కాంగ్రెస్ నాయకులు పిలుపు సిఐడి పోలీసుల అదుపులో నలుగురు రైస్ మిల్లర్లు 44వ డివిజన్‌లో కూటమి నేతల విస్తృత ప్రచారం.మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, వర్షంలోనూ ఇంటింటా ప్రచారం.. పవిత్ర రఘు ముందడుగు అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం, ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శల వర్షం ఎలక్ట్రికల్ ఏఇ అనుమానస్పద మృతి తుఫాన్‌ ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన 18వ వార్డులో డాక్టర్ శ్రీరామ్ రెడ్డికి ప్రజల బ్రహ్మరథం గడపగడపకు విస్తృత ప్రచారం.. వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యం వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. 20వ వార్డులో నూరి ఇక్బాల్ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం బ్లాస్టింగ్ దెబ్బకు ఇళ్లకు బీటలు! చౌడాపూర్ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ముబీన్ ఉత్కంఠ మారిన కోనసీమ జడ్పీ పీఠం లక్ష్మీనగర్‌లో 13వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రచారం

చౌడాపూర్ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ముబీన్

Select Suryaa Now
చౌడాపూర్ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ముబీన్

చౌడపూర్, మేజర్ న్యూస్: చౌడాపూర్ మండలంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ఎం.డి. ముబీన్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. , రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎల్పటి అశోక్ కుమార్, గ్రామ సర్పంచ్ నవీన్, మండల ప్రధాన కార్యదర్శి బి. రాము, ఆత్మ కమిటీ డైరెక్టర్ సలీమ్, వల్య నాయక్ తండా సర్పంచ్ నర్సింహా నాయక్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నర్సింలు, గ్రామ కమిటీ అధ్యక్షులు గోపాల్, మణికంఠ, నర్సింలు, అంజి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్: కోస్గి విజయ్ కుమార్, చౌడపూర్, వికారాబాద్ జిల్లా.