BREAKING
తుఫాన్‌ ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన 18వ వార్డులో డాక్టర్ శ్రీరామ్ రెడ్డికి ప్రజల బ్రహ్మరథం గడపగడపకు విస్తృత ప్రచారం.. వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యం వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. 20వ వార్డులో నూరి ఇక్బాల్ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం బ్లాస్టింగ్ దెబ్బకు ఇళ్లకు బీటలు! చౌడాపూర్ బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ముబీన్ ఉత్కంఠ మారిన కోనసీమ జడ్పీ పీఠం లక్ష్మీనగర్‌లో 13వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రచారం అమెరికాలో ఓటర్ల జాబితాలో విదేశీయులను గుర్తించాలని ట్రంప్ యంత్రాంగం ఆదేశం కల్వరాయన్ కొండల్లో కుండపోత వర్షాలు.. గోముఖి డ్యామ్‌కు పోటెత్తిన వరద.. కార్నెల్ విశ్వవిద్యాలయ బాధితురాలి గుర్తింపు గోప్యంగా ఉంచాలని కోర్టు తీర్పు కెనడాలో టెక్ సంస్థ హైలాండ్ వ్యాలీ కాపర్ మైన్‌లో కార్మికుల సమ్మె ప్రారంభం చాక్లెట్ల ధరల పెంపు వ్యూహం బెడిసికొట్టింది, అంగీకరించిన లిండ్ట్ సంస్థ చైర్మన్ బ్రిటన్ నూతన బడ్జెట్ ప్రకటనకు వేళాయే అక్టోబర్ 30న థియేటర్లలోకి యోగిబాబు సింగారం.. ఘనంగా ఆడియో వేడుక!

నవంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.!

Select Suryaa Now
నవంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.!

దుద్యాల, మేజర్ న్యూస్: కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా దుద్యాల మండలం హకీంపేట శివారులో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక వ్యవసాయ మేళాలో ఏర్పాటు చేసే స్టాళ్లను పరిశీలించడంతో పాటు నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. హకీంపేట శివారులో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్‌, కొడంగల్‌లో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవాలయ పనులను పరిశీలించే అవకాశముంది. అలాగే దుద్యాల మండల కేంద్రంలో నిర్మించిన మండల సమీకృత భవనం, దుద్యాల గేట్‌ సమీపంలోని నూతన పోలీస్‌ స్టేషన్‌, హకీంపేటలో నిర్మించిన సమీకృత విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బొంరాస్‌పేటలో నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ భవనాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించగా, భద్రతా చర్యలను పటిష్ఠం చేసేందుకు పోలీస్‌ శాఖ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ వెలువడాల్సి ఉంది.

రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.