ఉత్కంఠ మారిన కోనసీమ జడ్పీ పీఠం
అమలాపురం మేజర్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరిని వరించనుందనే అంశంపై జిల్లాలో ఆసక్తి నెలకొంది. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జడ్పీ ఎన్నికల నేపథ్యంలో తొలి జడ్పీ చైర్మన్ ఎవరవుతారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఈ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
టీడీపీ తరఫున రాజోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే టీడీపీ అధిష్ఠానం ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. మరోవైపు వైసీపీ తరఫున మాజీ ఎంపీ చింతా అనురాధ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కోనసీమ జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధిష్ఠానం తుది నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తుంది? జడ్పీ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుంది? Itself ఆసక్తికరంగా మారింది.
*రంబాల నాగసత్యనారాయణ అమలాపురం *