తుఫాన్ ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన
అవనిగడ్డ, మేజర్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నందున నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. ముఖ్యంగా నాగాయలంక, కోడూరు మండలాల తీర ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.తుఫాన్ నేపథ్యంలో నిత్యావసరాలు సిద్ధం చేసుకోవాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. అధికారులు సూచిస్తే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సహకరించాలని, పశుసంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారుల సూచనలను పాటించాలని ఎమ్మెల్యే కోరారు. ✍️అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.