అప్పుల బాధలు తట్టుకోలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య.. చిట్యాల మండలం శివనేనిగూడెంలో విషాదం
ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చిట్యాల మండలంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామానికి చెందిన కాలేరు రాందాస్ (43) గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. అప్పుల ఒత్తిడి కారణంగా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక శనివారం చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఔరా ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.