BREAKING
నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్ మెలియాపుట్టి జడ్పీటీసీగా బమ్మిడి చామంతి ఘన విజయం దీపావళి ఆనందంగా జరుపుకోవాలి... జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి భట్టిప్రోలు మండలం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి కాలిఫోర్నియా పోర్టుల కాంట్రాక్టు చర్చలు పొడిగింపు పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై విచారణ దక్షిణ అమెరికా పర్యటనలో పాప్ లియో ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సముద్ర దిగ్బంధానికి తోడుగా సరిహద్దు వాణిజ్యంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు విశాఖ యువకులను క్షేమంగా స్వదేశానికి చేరుస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొత్తూరు జడ్పిటిసి గా టిడిపి అభ్యర్థి లోతుగెడ్డ శ్రీదేవి గెలుపు

పాచిపెంట మండలం ఎంపీపీ పదవి గూడెపు యుగంధర్ కైవసం

Select Suryaa Now
పాచిపెంట మండలం ఎంపీపీ పదవి గూడెపు యుగంధర్ కైవసం

పాచిపెంట, సూర్య : పాచిపెంట మండలం ఎంపీపీ పదవి గూడెపు యుగంధర్ కైవసం చేసుకోగా జడ్పిటిసిగా మతల సౌజన్యం తెలుగుదేశం పార్టీ తరఫునుండి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి వైఎస్ఆర్సిపి తరఫునుండి పోటీ చసిన  కలువలపల్లి పుష్ప పై 2 284 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. పుష్ప కు 11003 ఓట్లు రాగా, సౌజన్య కు 13287 ఓట్లు వచ్చాయి. ఆమె గెలుపు తో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మండలంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది. వైయస్సార్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.

ఎంపీటీసీ విజేతలు వివరాలు :-  పాచిపెంట ఒకటవ సెగ్మెంట్ లో వైసీపీ కీ చెందిన డోల బాబ్జి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కే చిరంజీవి రాజు పై విజయం సాధించారు. పాచిపెంట రెండవ సెగ్మెంట్ లో మంత్రి గాయత్రి పై సాలూరు వెంకట లక్ష్మి 134 ఓట్లు మెజారిటీ తో గెలిచారు. పాచిపెంట 3వ సెగ్మెంట్లో సాసుబిల్లి మౌనిక పై అంపోలు గౌతమి 111 ఓట్లు మెజారిటీ తో విజయయం సాధించారు. గొట్టూరు సెగ్మెంట్ లో టీడీపీ అభ్యర్థి పై వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. గుమ్మడి గుడ సెగ్మెంట్ లో టీడీపీ అభ్యర్థి ఎర్ర జన్ని కన్నయ్య పై వైసీపీ అభ్యర్థి దోనేరు లచ్చయ్య విజయం సాధించారు. గురువునాయుడు పేటలో వైసీపీ అభ్యర్థి పై టీడీపీ అభ్యర్థి గెలిచారు. కర్రి వలస లో టీడీపీ అభ్యర్థి పై వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. కేసలిలో వైసీపీ అభ్యర్థి కళావతి పై టీడీపీ అభ్యర్థి మంచాల సావిత్రి విన్నాయారు. కొటికి పెంటసెగ్మెంట్ లో వైసీపీ పై టీడీపీ గెలుపొందారు.మాతుమూరు లో వైసీపీ అభ్యర్థి మూకల అప్పారావు పై టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జి యుగంధర్ గెలిచారు. మోసూరు సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్థి జి రాము పై టీడీపీ అభ్యర్థి గౌరీశంకర్ విజయం సాధించారు. పాంచాలి సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్థి కే పద్మ పై టీడీపీ అభ్యర్థి జి కావ్య గెలుపొందారు. అలాగే పణుకువలస సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్థి సీతమ్మ పై టీడీపీ అభ్యర్థి హేమంత్ విజయం సాధించారు. విశ్వనాధ పురంలో వైసీపీ అభ్యర్థి గండిపల్లి గంగమ్మ పై షుగట నీలిమ గెలిచారు. ఈ మేరకు టీడీపీ 10 ఎంపీటీసీ స్థానాలు గెలుపొందగా వైసీపీ 4 స్థానాల్లో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి రాధాకృష్ణ, ఎంపీడీవో బి వి జె పాత్రో విలేకరులకు తెలియజేశారు.