andhrapradesh
అద్దంకి ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం. 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 12 కైవసం.
సూర్య న్యూస్.
అద్దంకి మండలంలోని మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు గాను కలవకూరు, దేనువకొండ ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఒంగోలు క్విజ్ కళాశాలలో జరిగిన కౌంటింగ్ అనంతరం అధికారులు ఫలితాలు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసి, మండల పరిషత్ పీఠాన్ని దక్కించుకుంది. ఎన్నికలు జరిగిన 12 స్థానాల్లో టీడీపీ 10 స్థానాలను భారీ మెజారిటీతో దక్కించుకోగా, వైఎస్సార్‌సీపీ 2 స్థానాలకే పరిమితమైంది. మోదేపల్లి, కొటికలపూడి, తిమ్మాయపాలెం, వెంపరాల, చిన్న కొత్తపల్లి, ధర్మవరం, సింగరకొండ పాలెం, బొమ్మనంపాడు, నాగులపాడు, మనికేశ్వరం ఎంపీటీసీ స్థానాలను టిడిపి కైవసం చేసుకోగా, జార్లపాలెం, శంఖవరప్పాడు ఎంపీటీసీ స్థానాలను వైసీపీ ఖాతాలో వేసుకుంది. పోటీ చేసి గెలుపొందిన 10 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఏకగ్రీవమైన రెండు స్థానాలను కలిపి 12 ఎంపీటీసీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించడంతో మండలంలోనీి ఆయా గ్రామాలలో తెదేపాశ్రేణులు సంబరాలలో మునిగిపోయారు.