BREAKING
రామాయణం'లో సీత పాత్రను సాయి పల్లవి తప్ప ఇంకెవరూ చేయలేరు: ధనుష్ సంచలన వ్యాఖ్యలు నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపు రామాయణం'లో చిన్న పాత్ర అయినా నటించడం నాకెంతో గర్వకారణం: కాజల్ అగర్వాల్ భావోద్వేగ వ్యాఖ్యలు పైర్ సినిమాకు ఎదురుదెబ్బ: థియేటర్లలో 75 శాతం షోలను తగ్గించారన్న దర్శకుడు వినోద్ కాప్రీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచే అప్‌డేట్: 1955 కాలం నాటి కథతో 'అదర్ వరల్డ్స్' ప్రీక్వెల్ ప్రకటన త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే బాక్సాఫీస్ వద్ద రామాయణం సరికొత్త రికార్డులు: శనివారం నాటికి రూ.167 కోట్లు దాటిన వసూళ్లు చిట్టమూరు జడ్పీటీసీగా పెళ్లూరు సౌజన్య రెడ్డి ఘన విజయం! 1,820 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఓమ్: చాప్టర్ 1 - ఉదిరం' మల్టీ-హీరో సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ అభద్రతాభావానికి గురిచేస్తుంది: ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్

పర్యావరణ పరిరక్షణ - సహజ వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Select Suryaa Now
పర్యావరణ పరిరక్షణ - సహజ వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :  పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ విద్యుత్ , నీరు వంటి సహజ వనరులను పొదుపుగా వాడుకోవాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పి. సత్యవాణి పిలుపునిచ్చారు  . నెల్లూరులోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో బ్రిక్స్ - సుస్థిర జీవనశైలి వారోత్సవాల (2026) సందర్భంగా పర్యావరణహిత కార్యక్రమాలు వారం రోజులపాటు నిర్వహించి శనివారం ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో సత్యవాణి మాట్లాడుతూ  పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్ధాలను తగ్గించాలని పునర్వినియోగ అలవాట్లను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు . పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ సుస్థిర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు . మేరీ లైఫ్ మిషన్ లక్ష్యాలను ఆచరణలో పెట్టడం ద్వారా సుస్థిర అభివృద్ధికి సహకరించాలన్నారు . కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి ఈ - వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు .

వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు

నవంబర్ ఒకటవ తేదీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం పై అవగాహన కల్పించారు . నవంబర్ 2న విద్యుత్తు ఆదా అవసరం లేని సమయంలో విద్యుత్ దీపాలు ఫ్యాన్లు ఇతర విద్యుత్ పరికరాలను ఆపివేయడం, ఇంధన పొదుపును పాటించే అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపే కార్యక్రమం నిర్వహించారు . నవంబర్ మూడున నీటి సంరక్షణ పై అవగాహన కల్పిస్తూ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ , నీటి వృధాను అరికట్టడం నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు . నవంబరు నాలుగున సుస్థిర ఆహార వ్యవస్థల ప్రోత్సాహం పై అవగాహన చేపట్టారు . ఈ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలు , సాంప్రదాయ ఆహార పదార్థాల వినియోగం , ఆహార వ్యర్ధాల నివారణ కంపోస్టు తయారీ , సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. నవంబర్ ఐదు న సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండడం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం వాటికి ప్రత్యామ్నాయంగా పునర్వినియోగ సంచులు వాడడం, ప్లాస్టిక్ వ్యర్ధాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆరు న ఈ -  వ్యర్ధాల తగ్గింపు పై అవగాహన చేపట్టారు . ఈ కార్యక్రమంలో భాగంగా పాత కంప్యూటర్లు , మోనిటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కేబుల్స్ తదితర నిరుపయోగ వస్తువులను బాధ్యతాయుతంగా నిర్వహించడంతో పాటు రీ సైక్లింగ్ పై అవగాహన కల్పించారు. నవంబర్ 7న వ్యర్ధాల తగ్గింపు మరియు పునర్వినియోగంపై అవగాహన కల్పించారు. వ్యర్ధాలను మూలస్థాయిలోనే వేరు చేయడం వాటి ఉత్పత్తిని తగ్గించడం పునర్వినియోగం మరియు రీసైక్లింగ్ పద్ధతులు వాటి వల్ల పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు  . ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ ఏడిఏ డి. సుజాత , టెక్నికల్ వ్యవసాయ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు .