BREAKING
రామాయణం'లో సీత పాత్రను సాయి పల్లవి తప్ప ఇంకెవరూ చేయలేరు: ధనుష్ సంచలన వ్యాఖ్యలు నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపు రామాయణం'లో చిన్న పాత్ర అయినా నటించడం నాకెంతో గర్వకారణం: కాజల్ అగర్వాల్ భావోద్వేగ వ్యాఖ్యలు పైర్ సినిమాకు ఎదురుదెబ్బ: థియేటర్లలో 75 శాతం షోలను తగ్గించారన్న దర్శకుడు వినోద్ కాప్రీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచే అప్‌డేట్: 1955 కాలం నాటి కథతో 'అదర్ వరల్డ్స్' ప్రీక్వెల్ ప్రకటన త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే బాక్సాఫీస్ వద్ద రామాయణం సరికొత్త రికార్డులు: శనివారం నాటికి రూ.167 కోట్లు దాటిన వసూళ్లు చిట్టమూరు జడ్పీటీసీగా పెళ్లూరు సౌజన్య రెడ్డి ఘన విజయం! 1,820 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఓమ్: చాప్టర్ 1 - ఉదిరం' మల్టీ-హీరో సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ అభద్రతాభావానికి గురిచేస్తుంది: ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్

జెడ్పీటీసీ గా ' వలిరెడ్డి' గెలుపు ....4 ఎంపీటీసీలు వైసీపీ, 12 ఎంపీటీసీలు టీడీపీ, జనసేన రెండు ....

Select Suryaa Now
జెడ్పీటీసీ గా ' వలిరెడ్డి'  గెలుపు ....4 ఎంపీటీసీలు వైసీపీ, 12 ఎంపీటీసీలు టీడీపీ, జనసేన రెండు ....

చీపురుపల్లి మేజర్ న్యూస్:

మండలంలో శుక్రవారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల  ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయఢంకా మోగించారు.  గరివిడి ఎస్ డిఎస్ కళాశాలలో  ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మండలంలో 49,469 మంది ఓటర్లకు గాను  38,218 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు  టీడీపీ నుంచి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు (19,183), వైసీపీ నుంచి బెల్లాన వంశీకృష్ణ (17,506), కాంగ్రెస్ పార్టీ నుంచి నాగులపల్లి పైడిరాజు (147) పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు సమీప వైసీపీ అభ్యర్థి బెల్లాన వంశీ కృష్ణ పై 1,587 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు 40 మంది అభ్యర్థులు టీడీపీ, జనసేన,  వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులు   పోటీలో ఉండగా టీడీపీ నుంచి 12 స్థానాలు, జనసేన రెండు స్థానాలు గెలుపొందగా వైసీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. చీపురుపల్లి 1 అభ్యర్థిగా ఇజ్జిరోతు నిహారిక (టీడీపీ), వైసీపీ అభ్యర్థి మహంతి లక్ష్మీ పై 104 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు, చీపురుపల్లి 2 రేగాన శాంతి ప్రియ (టీడీపీ),  అడ్డూరి కృష్ణారావు (వైసీపీ)పై 198 ఓట్ల ఆధిక్యం, చీపురుపల్లి 3 మీసాల కాశీ విశ్వేశ్వరరావు (టీడీపీ), ముల్లు పైడిరాజు (వైసీపీ)పై 43 ఓట్లు ఆధిక్యం,  చీపురుపల్లి 4 నుంచి గవిడి నాగరాజు (టీడీపీ), ఇప్పిలి అనంతం (వైసీపీ)పై 219 మెజారిటీతో గెలుపొందారు.  చీపురుపల్లి 5 వంగపల్లి పేటలో వెంపడాపు హైమవతి (టీడీపీ), వెంపడాపు వెంకటరత్నం (వైసీపీ)పై 403 మెజారిటీ, చీపురుపల్లి 6 నుంచి కోట్ల కృష్ణ (జనసేన), కోసిరెడ్డి రమణ (వైసీపీ) పై 74 ఓట్లు ఆధిక్యం, రామలింగాపురం సారిక రామారావు (టీడీపీ) పై ఇప్పిలి వెంకట నర్సమ్మ (వైసీపీ) 33 ఓట్ల ఆధిక్యం, కర్లం నుంచి బాణాన రమణ (వైసీపీ)పై పొన్నాడ మహేశ్వరరావు (టీడీపీ) 360 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పేరిపి లో కోరాడ కోటేశ్వరరావు (టీడీపీ)పై లెంక రాజారావు (వైసీపీ) 60 ఓట్ల ఆధిక్యం, కరకాం నుంచి దన్నాన పద్మావతి (టీడీపీ), మీసాల వెంకటరమణ (వైసీపీ)పై 457 ఓట్లు తేడాతో గెలిచారు. నిమ్మలవలసలో పినిపిల్లి సుజాత (టీడీపీ)పై పెంట ముగతమ్మ (వైసీపీ) 47 ఓట్లు, రావివలస నుంచి శనపతి నవ్య (టీడీపీ), కొమ్ము పద్మజ (వైసీపీ)పై 428 ఓట్లు ఆధిక్యం,  ఇటకర్లపల్లి లో పాండ్రంకి కళావతి (టీడీపీ), రెడ్డి శాంతమ్మ (వైసీపీ)పై 199 ఓట్లు ఆధిక్యం, పెదనడిపల్లిలో సప్ప లక్ష్మీ (టీడీపీ), ఇప్పిలి గౌరీదేవి (వైసీపీ)పై 48 ఓట్లు ఆధిక్యం, అలజంగి లో శనపతి శ్రీదేవి (టీడీపీ)పై మీసాల జ్యోతి (వైసీపీ) 231 ఆధిక్యంతో గెలుపొందారు. మెట్టపల్లి లో వెంపడాపు రాజేశ్వరి (టీడీపీ), మీసాల శారద (వైసీపీ)పై 82 ఓట్లు ఆధిక్యం, జనసేన నుంచి పీకే పాలవలస లో బైరెడ్డి మణికంఠ, బైరెడ్డి తవుడమ్మ (వైసీపీ)పై 353 ఓట్లు ఆధిక్యం సాధించారు. గొల్లలములగాంలో చందక దుర్గా భవాని (టీడీపీ), కరిమజ్జి పద్మ (వైసీపీ)పై 146 ఓట్లు ఆధిక్యం సాధించారు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా