BREAKING
రామాయణం'లో సీత పాత్రను సాయి పల్లవి తప్ప ఇంకెవరూ చేయలేరు: ధనుష్ సంచలన వ్యాఖ్యలు నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపు రామాయణం'లో చిన్న పాత్ర అయినా నటించడం నాకెంతో గర్వకారణం: కాజల్ అగర్వాల్ భావోద్వేగ వ్యాఖ్యలు పైర్ సినిమాకు ఎదురుదెబ్బ: థియేటర్లలో 75 శాతం షోలను తగ్గించారన్న దర్శకుడు వినోద్ కాప్రీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచే అప్‌డేట్: 1955 కాలం నాటి కథతో 'అదర్ వరల్డ్స్' ప్రీక్వెల్ ప్రకటన త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే బాక్సాఫీస్ వద్ద రామాయణం సరికొత్త రికార్డులు: శనివారం నాటికి రూ.167 కోట్లు దాటిన వసూళ్లు చిట్టమూరు జడ్పీటీసీగా పెళ్లూరు సౌజన్య రెడ్డి ఘన విజయం! 1,820 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఓమ్: చాప్టర్ 1 - ఉదిరం' మల్టీ-హీరో సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ అభద్రతాభావానికి గురిచేస్తుంది: ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్

నెల్లూరు రూరల్ మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ప్రభంజనం

Select Suryaa Now
నెల్లూరు రూరల్ మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ప్రభంజనం

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ మండలంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను పెనుబర్తి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలిన 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 11 స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించి మండలంలో క్లీన్ స్వీప్ చేశారు.ముఖ్యంగా పొట్టేపాలెం, దేవరపాలెం, కాకుపల్లి, ఆమంచర్ల బిట్-1, ఆమంచర్ల బిట్-2, కందమూరు, వెల్లంటి, గొల్లకందుకూరు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. ఆయా గ్రామాల్లో ఓటర్లు తెలుగుదేశం పార్టీకి విశేష మద్దతు పలకడంతో ప్రత్యర్థి అభ్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు.అదేవిధంగా సౌత్ మోపూరు, ములుమూడి, దొంతాలి ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు స్థానాల్లో సీపీఎం, సీపీఐ బలపరిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.ఈ విజయంతో నెల్లూరు రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.ఈ ఘనవిజయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అందించిన సహాయ సహకారాలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందించిన మార్గదర్శకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి ఫలితమని గెలుపొందిన ఎంపీటీసీ అభ్యర్థులు పేర్కొన్నారు.మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడం తమపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమని, రానున్న రోజుల్లో గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని విజయం సాధించిన అభ్యర్థులు తెలిపారు.