బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ నూతన కౌన్సిలర్లకు మాజీ మంత్రి నల్లపరెడ్డి శుభాకాంక్షలు..
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : ఇటీవల జరిగిన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించిన కౌన్సిలర్లు 4వ వార్డు ఆరుముల్ల సతీష్ బాబు, 5వ వార్డు శ్రీమతి కోటపూరి ప్రవల్లిక, 9వ వార్డ శ్రీమతి షేక్ షాబిరా నేడు నెల్లూరులోని మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన నూతన కౌన్సిలర్లకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చెర్లో సతీష్ రెడ్డి, కొండూరు మధుసూదన్ రెడ్డి, బట్ట విల్సన్, పఠాన్ రసూల్, 11వ వార్డులో వైసీపీ తరఫున పోటీ చేసిన కుప్ప పవన్ మరియు తదితరులు పాల్గొన్నారు.