BREAKING
అగ్రీప్రెన్యూర్‌షిప్‌, ఆధునిక సాంకేతిక‌త‌పై ప్ర‌త్యేక దృష్టి డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై అవగాహన లఘుచిత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 103 ఫిర్యాదులు పోలీసులకు మూడు నూతన స్నిఫర్ డాగ్స్ కానిస్టేబుళ్లదే కీలక పాత్ర.. ప్రజలతో మర్యాదగా మెలగాలి బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.

Select Suryaa Now
పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.

కుదేలైన పత్తి సాగు – నష్టపోయిన పత్తి రైతులు.తెలంగాణ పత్తి రైతుల సంఘం డిమాండ్

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు క్రింది సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం తరుపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి మిల్లులలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏకకాలంలో ప్రారంభించాలి. తేమతో నిమిత్తం లేకుండా సీసీఐ ద్వారా రైతుల పత్తి పంటను కొనుగోలు చేయాలి. రైతులు తాము పండించిన పంటలను ఎక్కడైనా స్వేచ్ఛగా తమకు దగ్గరగా ఉండే సీసీఐ కేంద్రాలలో విక్రయించే అవకాశం కల్పించాలి. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు రైతులు పత్తి అమ్మకానికి వచ్చే సమయంలో మొబైల్ ఓటిపి ద్వారా అవకాశం కల్పించి, వచ్చిన కుటుంబ సభ్యుల ఫోటోను రికార్డుతో భద్రపరచి కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్ పత్తికి రూ.475/- బోనస్ అమలు చేయాలి. ఎల్ వన్, ఎల్ టు, ఎల్ త్రీ, ఎల్ ఫోర్, ఎల్ ఫైవ్ వంటి విధానాలను వెనక్కి తీసుకుని, రైతులపై రవాణా ఖర్చుల భారం పడకుండా తమకు సమీపంలోని సీసీఐ కేంద్రంలో పత్తి పంటను అమ్ముకునే అవకాశం కల్పించాలి. సీసీఐ ఎల్ వన్ ఎల్ టు ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ నిబంధనల పేరుతో మిల్లర్లను కట్టడి చేయడం పేరుతో రైతులకు దగ్గరగా ఉన్న మిల్లులలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన రైతులకు రవాణా చార్జీలు పెరిగి తీవ్రంగా నష్టపోతున్నారు. కాపస్ కిసాన్ యాప్‌ అమలు చేయడం వలన ఒక్కొక్క మిల్లు రోజువారీ నిల్వ స్లాట్ బుకింగ్ ద్వారా కాకుండా, రోజువారీ ఫిజికల్ నిల్వలు చేసిన ఆధారంగా కొనుగోలు చేయాలి. ఎక్కువ మంది రైతులు వస్తే రోజుల తరబడి సీసీఐ కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. దీనివల్ల రైతులకు రవాణా వెహికల్ చార్జీలు పెరిగి నష్టం జరుగుతోంది. కావున ఈ సమస్యను పరిష్కరించాలి. సీసీఐ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా ప్రతి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్ చేయాలి. జిల్లాల వారీగా మ్యాపింగ్ విధానం సహేతుకమైనది కాదు. రైతులకు సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించే విధంగా విధానాన్ని చేసి అమలు చేయాలి. పై సమస్యలను దృష్టిలో ఉంచుకొని పత్తి రైతులకు నష్టం కలగకుండా, తగిన చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం తరుపున కోరారు